Tipparthy : ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : ఏఓ సన్నిరాజు

Follow

తిప్పర్తి, జూన్ 30 : డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తిప్పర్తి మండల మండల వ్యవసాయ అధికారి సన్నిరాజు హెచ్చరించారు. సోమవారం మండలంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. పజ్జూరు ఆగ్రో రైతు సేవా కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పాస్ మిషన్‌లోని స్టాక్, గ్రౌండ్ స్టాక్‌ను సరిచేయడం జరిగింది. రిజిస్ట్రర్ బిల్ బుక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువ ధరలకు ఎరువులను, విత్తనాలను అమ్మకూడదన్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ తప్పనిసరిగా తీసుకురావలన్నారు. ఆయన వెంట ఏఈఓ వికాస్ ఉన్నారు.
డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తిప్పర్తి మండల మండల వ్యవసాయ అధికారి సన్నిరాజు హెచ్చరించారు. సోమవారం మండలంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.