Tollywood | టాలీవుడ్‌ని నిరాశ‌ప‌రిచిన మొద‌టి ఆరు నెల‌లు.. రానున్న సినిమాలైన ప్రాణం పోస్తాయా..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Twd

Tollywood | ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో తెలుగు చిత్రసీమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన కొన్ని సినిమాలు మాత్రమే ఓ మోస్తరుగా వసూళ్లు సాధించగా, చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లతో ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన వివాదాలు కూడా ఇండస్ట్రీపై ప్రభావం చూపాయి. చిన్న సినిమాలు కొన్ని ఆకట్టుకున్నా… పెద్ద సినిమాల కొరత వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. ఫెస్టివల్ సీజన్‌లోనూ బిగ్ బడ్జెట్ సినిమాల లేమి స్పష్టంగా కనిపించింది. జ‌న‌వ‌రిలో వ‌చ్చిన డాకు మహారాజ్ ఓ మోస్తరు విజ‌యం సాధించింది. ఫిబ్రవరిలో వ‌చ్చిన తండేల్ హిట్ టాక్ అందుకుంది అంతే. మార్చిలో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ కొంత మేరకు ఆకట్టుకున్నా మిగ‌తా సినిమాల‌న్నీ బోల్తా కొట్టాయి. ఏప్రిల్ నెలలో అయితే ఒక్క హిట్ కూడా లేదు.

మేలో చూస్తే.. హిట్ 3: ది థర్డ్ కేస్, సింగిల్ సినిమాలు ఓ మోస్త‌రు విజ‌యాలు సాధించాయి. ఇక జూన్ లో కుబేర, కన్నప్ప వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొంత ఊపునిచ్చాయి. అయితే మొత్తం మీద చూస్తే… పెద్ద స్టార్ సినిమాలు లేకపోవడమే మొదటి అర్ధభాగం బలహీనతగా మారింది. ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు విడుదల కాలేదు. ఇకపై అసలైన బాక్సాఫీస్ యుద్ధం జ‌రిగేలా క‌నిపిస్తుంది. జూలై నుంచి డెసెంబర్ వరకు టాలీవుడ్ మళ్లీ ఊపందుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీ సినిమాలు సెకండ్ హాఫ్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ట్రేడ్ వర్గాలు, థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ విడతపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానుండ‌గా, తమ్ముడు (నితిన్ – వేణు శ్రీరామ్) చిత్రం జూలై 4న విడుదల రానుంది. ఆ త‌ర్వాత OG, అఖండ 2, మిరాయ్, విశ్వంభర,  రాజా సాబ్ వంటి భారీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ చిత్రం ఆగస్ట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాల్లో కొన్ని చారిత్రక నేపథ్యం ఉన్నవి, మరికొన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు. ఇప్పటికే టీజర్లు, ఫస్ట్ లుక్స్, పోస్టర్లు విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. అయితే ఇండస్ట్రీ ఉత్సాహంగా ఉండాలి అంటే ఒక‌టి, రెండు విజయాలు సరిపోవు, వరుస విజయాలు అవసరం. ఈసారి టాలీవుడ్‌కి కావలసిన స్టార్ పవర్, బడ్జెట్ రేంజ్, కంటెంట్ డైవర్సిటీ అన్నీ రెండో భాగంలో ఉన్నాయి.మ‌రి పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ను కుదిపేస్తాయా? టాలీవుడ్ దూకుడు తిరిగి వస్తుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

​Tollywood | ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో తెలుగు చిత్రసీమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన కొన్ని సినిమాలు మాత్రమే ఓ మోస్తరుగా వసూళ్లు సాధించగా, చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లతో ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన వివాదాలు కూడా ఇండస్ట్రీపై ప్రభావం చూపాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *