Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Top Headlines 9 Pm 20th June 2025

విశాఖకు ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం..
భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు అడుగుపెట్టారు.. ఒడిశా పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్న ప్రధాని మోడీకి ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద స్వాగతం పలికారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌.. ఇక, ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి రోడ్డు మార్గాన ఐఎన్ఎస్ చోళాకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నౌకాదళ అతిథిగృహానికి వెళ్లి రాత్రికి అక్కడే బసచేయనున్నారు మోడీ. కాగా, రేపు విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఆర్కే బీచ్‌లో రేపు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం.. అక్కడ యోగాసనాల్లో పాల్గొంటారు ప్రధాని మోడీ…

రప్పా.. రప్పా.. డిప్యూటీ సీఎం పవన్‌పై అప్పలరాజు హాట్‌ కామెంట్స్‌
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ రప్పా.. రప్పా.. డైలాగ్ చుట్టూ తిరుగుతున్నాయి.. తాజాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో యువత పోరు పోస్టర్ ను వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ, కుంబం హరి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్‌ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైఎస్‌ జగన్‌ని మాత్రమే విమర్శించడానికి మీరు ముందుకు వస్తున్నారని పవన్ పై ఫైర్ అయ్యారు అప్పలరాజు… మీరు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయిండి రప్పా.. రప్పా.. అన్న వాళ్లని సమర్థించడమా.. అని పవన్ వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి సీదిరి మండిపడ్డారు. ఎన్ని వేల కోట్లు యువకులకి బాకీ పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బీజేపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.. పవన్ మంచితనాన్ని చూశారు నా కొడకల్లారా..! ఎంత మంది వైసీపీ గూండాలొస్తున్నారో.. రండి తోలు తీస్తాను నాకొడకల్లారా.. అన్న డైలాగులు నావి కావని.. పవన్ సార్ డైలాగ్ లేనని దెప్పి పొడిచారు.. వీరమల్లులో ఇలాంటి డైలాగులు ఉండవని గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. 2014 కు ముందు చంద్రబాబును చూసి యువకులు మోసపోతే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చూసి మోసపోయారని విమర్శించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు..

భారీ టూరిజం ప్రాజెక్టుగా పోలవరం.. సర్కార్‌ కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. అయితే, ఇదే సమయంలో.. పోలవరాన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 15 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు.. 255 కోట్ల రూపాయలతో రిసార్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. వచ్చే ఏడాది నుంచి రిసార్ట్ పనులు ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ ను ఆనుకుని ఉన్న కొండ పై భాగంలో ఈ రిసార్ట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి..

సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థుల గిన్నీస్‌ రికార్డు.. మంత్రి లోకేష్‌ అభినందనలు..
సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్‌ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌.. విద్యార్థులను అభినందించారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఈ రికార్డు ప్రకటించనున్నట్టు వెల్లడించారు.. ఇక, జూన్ 21వ తేదీ తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.. వారానికి ఒక రోజు యోగా కచ్చితంగా అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.. అయితే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇచ్చాం అన్నారు మంత్రి లోకేష్.. ఇక్కడకు వచ్చిన పిల్లల కమిట్మెంట్ చాలా సంతోషంగా అనిపించింది.. మా అబ్బాయికి కూడా మీలాంటి శిక్షణ అవసరం అనిపిస్తోందన్నారు.. ఒకే పిలుపుతో ప్రపంచం మొత్తం మనవైపు చూసే విధంగా చేసినందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు లోకేష్‌..

త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కొత్వాల్‌గూడ ఎకో పార్క్..
కొత్వాల్ గూడ ఎకో పార్కుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, MAUD సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ కొత్వాల్ గూడ ఎకో పార్కును నిర్మించింది. ఎకో పార్కులోని అరైవల్ ప్లాజా పనులు పూర్తి చేసి.. మరో రెండు నెలల్లో ఈ పార్కును పబ్లిక్ కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎస్ కు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ తెలియజేశారు. అయితే, హెచ్ఎండీఏ డెవలప్ చేసిన బుద్వేల్, నియో పోలీస్ లేఅవుట్లను సీఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. నియో పోలీస్ దగ్గర నిర్మించిన ట్రంపెట్ వల్ల శంకర్ పల్లి, మోకిల ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని సీఎస్ చెప్పుకొచ్చారు. అలాగే, శంషాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ పై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి నగర ప్రజలకు అందిస్తున్న సేవలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

ఆయన నల్లికుట్ల మనిషి.. నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు అని తెలిపింది. ముఖ్యమంత్రి దగ్గరకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు అని చెప్పుకొచ్చింది. తెలుగు దేశం పార్టీలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించింది.

మోడీని భోజనానికి పిలిచిన ట్రంప్.. తిరస్కరించిన ప్రధాని.. ఎందుకంటే..?
బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్‌లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. మోడీని దగ్గర నుంచి చూసిన ప్రజలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు. మోడీ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ, ప్రజా విశ్వాసానికి అంకితం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు. “రెండు రోజుల క్రితం నేను G7 శిఖరాగ్ర సమావేశానికి కెనడా వెళ్ళాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు. ఎలాగో మీరు కెనడాకు వచ్చారు. వాషింగ్టన్ మార్గంలో భారత్‌కు వెళ్లండి. మనం వాషింగ్టన్‌లో కలిసి భోజనం చేసి మాట్లాడుకుందాం. అని ట్రంప్ నన్ను భోజనానికి ఆహ్వానించారు. కానీ నేను ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించాను. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం నాకు చాలా ముఖ్యం.. అని నేను ట్రంప్‌తో చెప్పాను. మహాప్రభువు పట్ల నాకున్న ప్రేమ, భక్తి నన్ను ఈ భూమికి తీసుకువచ్చాయి.” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

సెంచరీతో బౌలర్లకు చుక్కలు చూపించిన యశస్వి జైస్వాల్..రికార్డుల మోత..!
ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్‌ గడ్డపై 144 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బౌలర్లకు చుక్కలు చూయించాడు. దీంతో యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో రెండవ సెషన్‌లో ఐదవ సెంచరీని పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో ఇది జైస్వాల్‌కు మూడవ సెంచరీ. ఈ సెంచరీతో కొత్త రికార్డులను సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ పేరిట ఓ ప్రత్యేకమైన రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండింటిలోనూ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఐదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. ఇంగ్లాండ్‌లో సెంచరీ సాధించిన రెండవ అతి పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.

బాలకృష్ణ మూవీ కోసం ఏడ్చారా.. లయ క్లారిటీ..
సీనియర్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. దీన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో లయకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణకు సిస్టర్ గా చేయాలని వివి వినాయక్ అడిగితే మీరు ఏడ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. నిజమేనా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. లయ స్పందిస్తూ.. ఏమో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఆ మూవీ వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఒకవేళ ఏడిస్తే ఏడ్చానేమో. బాలకృష్ణ గారితో అప్పట్లో నటించాలని నాకు ఉండేది’ అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో లయ చాలా మంది హీరోల సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

కుబేర మేకింగ్ వీడియో.. ధనుష్ కష్టం చూడండి..
శేఖర్ కమ్ముల డైరెక్ష్మన్ లో వస్తున్న కుబేర మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ధనుష్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో రష్మిక పాత్ర కూడా చాలా కీలకం. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది మూవీ. తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించేందుకు ఎంత కష్టపడ్డాడో చూపించారు. ఈ వీడియోలో ఆయన నడిరోడ్డు పక్కన ఓ మూలన కూర్చోవడం.. అతని చేతిలో ఓ వీధి కుక్కను పట్టుకోవడం.. మాసిపోయిన బట్టలు, గుబురు గడ్డం, చెదిరిపోయిన జుట్టు.. ముఖం నిండా మసి పూసుకున్నట్టు ఆయన లుక్ ను చూస్తే ఎవరైనా ఇంత నేచురల్ గా చేయడానికి ఎంత కష్టపడ్డాడో అని అనుకోవాల్సిందే. ఈ మూవీలో ధనుష్ ఎనిమిది గంటలు చెత్త కుప్పల్లో షూట్ చేశానని స్వయంగా చెప్పాడు. రష్మిక కూడా తనతో పాటే అదే చెత్త కుప్పల్లో షూట్ చేసిందని తెలిపాడు. ఇప్పుడు మేకింగ్ వీడియో చూస్తే వీరు ఎంత కష్టపడ్డారో అర్థం అవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

థియేటర్ లో ఏడ్చేసిన ధనుష్..
తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ లో తన కుమారుడితో కలిసి చూశారు. ఈ మూవీలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద తన పాత్రను చూసుకుని ఎమోషనల్ అయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసుకుని కొంచెం ఎమోషన్ అయినట్టు కనిపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ.. ఫస్ట్ షో నుంచే అన్ని ఏరియాల్లో మంచి టాక్ సంపాదించుకుంది. ధనుష్ లాంటి స్టార్ హీరో ఒక బిచ్చగాడిగా కనిపించడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పైగా బిచ్చగాడి గెటప్ లో ఆయన ఒదిగిపోయిన తీరు ప్రశంసలు కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నాగార్జునకు సరైన పాత్ర పడింది.

​Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 9 PM  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *