Top Headlines @ 9 PM: టాప్ న్యూస్

Follow

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆయనకే.. రేపే అధికారిక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడిందనే చెప్పాలి.. నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మాధవ్.. ఇక, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను రేపు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు.. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్‌ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం.. అయితే, ఈ రోజు మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడవు ముగిసింది.. పీవీఎన్ మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.. ఒకే నామినేషన్ వేయడంతో దాదాపు ఏపీ బీజేపీ చీఫ్ పేరు ఖరారైనట్టే.. దీనిపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఎన్ మాధవ్ దాఖలు చేసారు.. పీసీ మోహన్, పాకా సత్యనారాయణ ఎన్నికలు నిర్వహించారు.. రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు.. ఇవాళ నామినేషన్లు స్క్రూటినీ జరుగుతుంది.. రేపు అధ్యక్షుని ప్రకటన జరుగుతుందన్నారు సోము వీర్రాజు..
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రూ.8.20 కోట్ల రూపాయలు తరలించినట్టు బాలాజీపై ఆరోపణలు ఉండగా.. ఇండోర్ లో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.. బాలాజీ లొకేషన్ ఆధారంగా ఇండోర్ వెళ్లిన సిట్ బృందం.. అతడిని పట్టుకుంది.. ఇక బాలాజీతో పాటు నవీన్‌ను కూడా అదుపులోకి తీసుకుంది.. ఆ ఇద్దరు నిందితులను ఇండోర్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు సిట్ అధికారులు..
పీవీఎన్ మాధవ్ నేపథ్యం ఇదే.. అరుదైన రికార్డు..!
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది.. అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో, పార్టీ విధేయులకు బీజేపీ పెద్దపీట వేస్తోందని మరోసారి రుజువైంది.. దశాబ్దాలు తరబడి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు కట్టబెట్టుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను ఎంపిక చేసింది. రాష్ట్ర నేతలు ఒకటి తలిస్తే.. హైకమాండ్ మరొకటి చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ అధ్యక్షుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్లు, ఆశావహులకు షాకిస్తూ.. కొత్త అధ్యక్షులను ఎంపిక చేసింది. ఇక, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు మాధవ్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసినట్లవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డు. మాధవ్ తండ్రి చలపతిరావు.. కాషాయ పార్టీకి తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు చలపతిరావు గురువులాంటి వారు.
ఇదేం అరాచకం..? తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.!
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తారు.. శ్రీవారి గర్భాలయంలో ఒక్కసారి అయినా అడుగుపెడితే చాలు అని భావించేవారు కొందరైతే.. ఏడాది ఓసారి.. నెలకు ఓసారి.. ఇలా రెగ్యులర్‌గా వెళ్లే భక్తులు కూడా ఉంటారు.. ఇలా నిత్యం తిరుమల గిరులు కళకళలాడుతుంటాయి.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..? తిరుమల వెంకటేశ్వరస్వామి గర్భాలయం నమూనాతో ఓ హోటల్ వెలిసింది.. వెజ్ హోటల్ అయితే, భక్తులు హర్షించేవారేమో.. కానీ, నాన్‌వెజ్ హోటల్.. తిరుమల కొండను భక్తులు పవిత్రంగా భావిస్తారు.. ఇక, గర్భాలయంలో అడుగుపెట్టి భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు.. ఇప్పుడు శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్‌వెజ్ హోటల్ పెట్టడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు..
శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్రకోణం..!
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..
హైదరాబాద్‌లో కుండపోత వాన..!
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఈ అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం పూర్తిగా తగ్గకపోవడంతో జూలై 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది.
పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రేపు ఘటనా స్థలం సందర్శన
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన, బాధితుల కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 1) ఉదయం 10 గంటలకు స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రి దామోదర రాజనర్సింహ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సమీక్షించారు.
2016లో అదృశ్యమైన జేఎన్‌యూ ముస్లిం విద్యార్థి.. ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్..
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసు ముగిసింది. ఈ కేసును కోజ్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ముగింపు నివేదికను కోర్టు అంగీకరించింది. నజీబ్ అహ్మద్ అక్టోబర్ 15, 2016 నుంచి కనిపించకుండా పోయాడు. 2018లో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. సీబీఐ నివేదికలో నజీబ్ మిస్సింగ్‌పై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని సీబీఐ పేర్కొంది. ఆ మేరకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జ్యోతి మహేశ్వరి సోమవారం సీబీఐ క్లోజర్ నివేదికను ఆమోదించారు. అయితే భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించిన ఏవైనా కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే, కేసును తిరిగి తెరవవచ్చని కోర్టు స్పష్టం చేసింది. నజీబ్‌ను గుర్తించడంలో ఏజెన్సీకి ఎటువంటి విజయం లభించకపోవడంతో, 2018 అక్టోబర్‌లోనే ఈ కేసులో దర్యాప్తును సీబీఐ ముగించింది. ఢిల్లీ హైకోర్టు నుండి అనుమతి పొందిన తర్వాత, ఏజెన్సీ తన ‘క్లోజర్ నివేదిక’ను కోర్టు ముందు దాఖలు చేసింది.
బంకర్-బస్టర్ బాంబుల తయారీకి భారత్ అడుగులు.. దీని ప్రత్యేకత ఏంటి..?
జూన్ 22న అమెరికా తన B-2 బాంబర్ విమానాల నుంచి ఇరాన్‌లోని ఫోర్డో అణు కర్మాగారంపై బంకర్-బస్టర్ (GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్) బాంబులను జారవిడిచిన విషయం తెలిసిందే. ఈ వైమానిక దాడిలో ఇరాన్ కి చెందిన ప్రధాన అణు కర్మాగారం తీవ్రంగా ధ్వంసమైంది. వాస్తవానికి, ఇరాన్ పర్వతాల మధ్య భూమికి100 మీటర్ల లోతులో ఫోర్డో అణు కర్మాగారాన్ని నిర్మించింది. ఇది సాధారణ బాంబుల ద్వారా దెబ్బతినే అవకాశమే లేదు. అందుకే అమెరికా ఈ అణు కర్మాగారంపై బంకర్-బస్టర్ బాంబులను వేయాలని నిర్ణయించుకుంది. ఈ బాంబులు 60 నుంచి 70 మీటర్ల రంధ్రం చేస్తే.. భూమిలోకి చొచ్చుకుపోయాయి. ఆపై పెద్ద శబ్ధంతో పేలిపోతాయాయి. అంటే, ఈ బాంబులను శత్రువులకు చెందిన భూగర్భ బంకర్లను ఈజీగా నాశనం చేస్తాయి.
ఫ్లాష్ సేల్.. రూ.400కే 400GB డేటా.. త్వరపడండి..!
భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సొసైల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్ ను బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది.
ఇంగ్లండ్ పర్యటనలో మూడు భారత జట్లు.. జులై షెడ్యూల్ ఇదే!
ప్రస్తుతం మూడు భారత జట్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడుతుండగా.. మహిళల జట్టు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. మరోవైపు ఆయుష్ మాత్రే అండర్-19 జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే పర్యటిస్తోంది. ఇంగ్లీష్ యువ జట్టుతో ఆయుష్ మాత్రే టీమ్ మ్యాచ్‌లు ఆడుతోంది. మొత్తంగా భారత క్రికెటర్స్ అందరూ ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. ఇక జులైలో భారత క్రికెట్ జట్టు పూర్తి షెడ్యూల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ ముగ్గురూ కలిసి మూవీని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇందుకోసం నిర్మాణ సంస్థకు భారీగానే చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. లోకేష్ డైరెక్షన్ కావడంతో మూవీపై గ్యారెంటీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇందులో నాగార్జున ఉండటంతో తెలుగునాట హైప్ ఎక్కువగా ఉంది.
అనుపమ సినిమా.. సెన్సార్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన..
క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపీ కొత్త సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం నిరాకరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బోర్డు తీరుపై మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బోర్డ్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసింది. అమ్మ, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ సమక్షంలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో సినీ, సీరియల్ యాక్టర్సు అందరూ పాల్గొని బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ గా మారిన కేర్ ఆఫ్ కంచరపాలెం నటి, నిర్మాత
రానా దగ్గుబాటి కంటెంట్ డ్రివెన్ సినిమాలకు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడ్యూస్ చేసినా, ప్రెజెంట్ చేసినా అతను యూనిక్ కథలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. తన బ్యానర్, స్పిరిట్ మీడియాలో రానా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ కోసం ప్రవీణ పరుచూరితో మరోసారి చేతులు కలిపారు. ఈ చిత్రం ద్వారా ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు పల్లెటూరి సున్నితమైన హాస్యంతో కూడిన, లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్. C/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి కల్ట్ ఫేవరెట్ చిత్రాలను నిర్మించిన ప్రవీణ ఇప్పుడు డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇది ఒక నాస్టాల్జిక్, హ్యుమరస్, ఆలోచింపజేసే కథ.
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 9 PM