TTD Laddu Kiosks: యూపీఐ పేమెంట్స్‌తో లడ్డూ టోకెన్లు.. తిరుమలలో కియాస్క్‌ల ఏర్పాటు

Follow

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం లడ్డూ కౌంటర్ల వద్ద సెల్ఫ్ సర్వీస్ కియాస్క్‌ల(TTD Laddu Kiosks)ను ఏర్పాటు చేసింది. టచ్ స్క్రీన్ ఉండే ఆ మెషీన్ వద్ద.. ఒకవేళ అదనపు లడ్డూలు కావలంటే భక్తులు టోకెన్లు తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ ద్వారా లడ్డూ టోకెన్లు జారీ చేస్తున్నది. దీంతో లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో ఉన్న వేర్వేరు లడ్డూ కౌంటర్ల వద్ద ఈ కొత్త తరహా కియాస్క్ మెషీన్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ పేర్కొన్నది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత భక్తులకు రిసీట్ వస్తుందని, ఆ రిసీట్ ద్వారా అదనపు లడ్డూలను కౌంటర్ వద్ద తీసుకోవచ్చు అని, భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు అని టీటీడీ తన ప్రకటనలో తెలిపింది.
భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు టీటీడీ డిజిటల్ సేవల్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నది. చాలా సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తున్నది. భక్తుల సౌకర్యార్థం కొత్త తరహా టెక్నాలజీ కియాస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొన్నది. తిరుమలలోని ప్రతి టచ్ పాయింట్‌లో భక్తులను సంతృప్తిపరచాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు టీటీడీ చెప్పింది. దశలవారీగా అనేక చోట్ల కియాస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తొలిసారి కియాస్క్‌లకు వాడే వారి కోసం, వృద్ధుల కోసం ప్రత్యేక స్టాఫ్ట్‌ను నియమించారు. ఇలాంటి డిజిటల్ సేవల్ని మరింత విస్తరించాలని టీటీడీ భావిస్తున్నది. దీనిలో భాగంగా అకామిడేషన్, ప్రసాదం కౌంటర్ల వద్ద టచ్ స్క్రీన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.
TTD Laddu Kiosks: లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు.. తిరుమలలో కియాస్క్‌లను ఏర్పాటు చేశారు. యూపీఐ పేమెంట్స్‌తో లడ్డూ టోకెన్లు పొందవచ్చు. కియాస్క్ టచ్ స్క్రీన్లను మరికొన్ని చోట్లకు విస్తరించేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తున్నది.