US B-2 Stealth Bombers: ఇరాన్‌లో విధ్వంసం సృష్టించిన అమెరికన్ B-2 బాంబర్ల ప్రత్యేకతలు ఇవే.. ధర ఎంతంటే?

Follow

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు. ఇరాన్‌లోని పర్వతాల కింద 80 శాతం లోతులో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుఎస్ బి-2 బాంబర్ విమానాలు మిస్సౌరీ నుంచి ఇరాన్‌కు ఎలా వెళ్లి ధ్వంసం చేశాయో, ఈ బాంబర్ ధర ఎంత అని భారత వైమానిక దళ మాజీ అధికారి అజయ్ అహ్లవత్ చెప్పారు.
Also Read:Lopaliki Ra Chepta: ‘ లోపలికి రా చెప్తా’ అంటున్నారేంట్రా.. ట్రైలర్ రిలీజ్
US B-2 బాంబర్ విమానాలు USA లోని మిస్సోరి నుంచి బయలుదేరి ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలు – ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ లపై ఆయుధాలను జారవిడిచి సురక్షితంగా తిరిగి వచ్చాయి. B-2 స్పిరిట్ స్టీల్త్ బాంబర్ ఒక అదృశ్య డిస్ట్రాయర్, US వైమానిక దళం, అత్యంత అధునాతన, ఖరీదైన ఆయుధం అని తెలిపారు. దీని ప్రత్యేకత ఏమిటంటే B-2 ఏ రాడార్ వ్యవస్థ ద్వారానూ గుర్తించబడని విధంగా రూపొందించారు. ప్రతి B-2 విమానం $2.2 బిలియన్ల (సుమారు రూ. 19000 కోట్లు) కంటే ఎక్కువ ఖర్చవుతుందని తెలిపారు.
Also Read:Euphoria: తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా: భూమిక చావ్లా
దాని ద్వారా జారవిడిచిన 13600 కిలోల బంకర్ బస్టర్ బాంబు GBU-57, 200 అడుగుల లోతైన కాంక్రీట్ బంకర్లను చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రతి బాంబు ధర దాదాపు $20 మిలియన్లు (సుమారు రూ. 173 కోట్లు). ఈ B-2 బాంబర్ల ద్వారా, ఇరాన్ అణు స్థావరాలను బంకర్-బస్టర్ బాంబులతో లక్ష్యంగా చేసుకున్నామని, వీటిలో ప్రధానంగా GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులు ఉన్నాయని, ఇవి ఫోర్డో వంటి భూగర్భ ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయని తెలిపారు.
Also Read:Saeed Abbas Araghchi: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
B-2 బాంబర్ ప్రత్యేకతలను పరిశీలిస్తే.. అది 69 అడుగుల పొడవు, 172 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని ఖాళీ బరువు 71,700 కిలోలు, ఆయుధాలను అమర్చిన తర్వాత, దాని బరువు 1.70 లక్షల కిలోల వరకు ఉంటుంది. అంత బరువుతో, అది సులభంగా ఎగురుతూ లక్ష్యాన్ని చేధించగలదు. నివేదికల ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో 20 B-2 బాంబర్లు ఉన్నాయి. దీని వేగం గంటకు 1010 కిలోమీటర్లు, ఇది ఆగకుండా 11 వేల కిలోమీటర్లు పయనిస్తుంది. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన ఈ B-2 దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప సైనిక విజయంగా అభివర్ణించారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించారు. ఇరాన్‌లోని పర్వతాల కింద 80 శాతం లోతులో ఉన్న ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుఎస్ బి-2 బాంబర్