US Open Super 300 | విశ్వ వేదికపై మెరిసిన ఆయుష్‌.. కెరియర్‌లో తొలి టైటిల్ కైవసం..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Aush Shetty

US Open Super 300 : భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) కెరియర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్ సూపర్ 300 (US Open Super 300) టోర్నీలో విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్‌కు షాకిచ్చి.. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. ఈ సీజన్‌లో భారత షట్లర్ల తరఫున మొదటి టైటిల్ దేశానికి అందించాడు. అయితే.. మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తన్వీ శర్మ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

యూఎస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో ఆయుష్ సంచలన విజయాలతో ఔరా అనిపించాడు. సెమీ ఫైనల్లో చౌ థియెన్ చెన్‌పై అద్భుత విక్టరీతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు ఆయుష్. అతడిపై భారత షట్లర్‌కు ఇది మూడో విజయం. టైటిల్ పోరులో 20 ఏళ్ల ఆయుష్‌ ధాటికి యాంగ్ నిలవలేకపోయాడు. 47 నిమిషాల పాటు సాగిన పోరులో 21-18, 21-13తో ప్రత్యర్థిని మట్టికరిపించి కలల ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.

‘ఈ విజయం నాకు చాలా అమూల్యమైంది. సీనియర్ విభాగంలో నేను గెలుపొందిన తొలి టైటిల్ ఇది. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీ ద్వారా ఎన్నో సానుకూలాంశాలు నేర్చుకున్నా. ఇక్కడ నేను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. వచ్చేవారం మొదలవ్వనున్న కెనడా ఓపెన్ మీద దృష్టి సారించాలనుకుంటున్నా’ అని ఆయుష్ భావోద్వేగంతో చెప్పాడు.

ఆఖరి మెట్టుపై తడబడి..

మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన తన్వీ శర్మ ఆఖరి మెట్టుపై తడబడింది. మూడు సెట్ల హోరాహోరీ పోరులో అమెరికాకు చెందిన టాప్ సీడ్ బీవెన్ ఝాంగ్ చేతిలో ఓడిపోయింది. ‘రన్నరప్‌గా నిలవడం బాధగానే ఉంది. అయినా సరే నా ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను. ఫైనల్ మ్యాచ్‌కు ముందు నేను కొంచెం నెర్వస్‌గా ఫీలయ్యాను. పైగా చాలా పొరపాట్లు కూడా చేశాను. నా కెరియర్లో తొలి సూపర్ 300 ఫైనల్ ఇది. ఛాంపియన్‌గా నిలిస్తే ఆ సంబురం వేరేలా ఉండేది’ అని తన్వీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

​US Open Super 300 : భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) కెరియర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్ సూపర్ 300 (US Open Super 300) టోర్నీలో విజేతగా అవతరించాడు. మూడో సీడ్‌కు షాకిచ్చి.. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *