Vajrasana Benefits: అన్నం తిన్నాక వజ్రాసనం వేస్తే ఈ సమస్యలన్నీ మాయం.. యోగా మంత్రమిదే!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Vajrasana Benefits: అన్నం తిన్నాక వజ్రాసనం వేస్తే ఈ సమస్యలన్నీ మాయం.. యోగా మంత్రమిదే!

అన్నం తిన్న తర్వాత వజ్రాసనం వేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి. వజ్రాసనాన్ని అన్నం తిన్న తర్వాత 10 నిమిషాల పాటు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వజ్రాసనం వేయడం వల్ల జీర్ణ అవయవాలకు రక్తప్రవాహం పెరుగుతుంది. జీర్ణ ఎంజైమ్స్‌ ఉత్పత్తి ఈజీ అవుతుంది. తిన్న వెంటనే వజ్రాసనం వేయడం వల్ల గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వజ్రాసనం వేస్తే పేగు కదలికలు ఆరోగ్యకరంగా మారుతాయి.

భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేయడం వల్ల పోషకాల శోషణ పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. సాధారణంగా అన్నం తిన్న తర్వాత షుగర్‌ పెరుగుతుంది. వజ్రాసనం వేస్తే అకస్మాత్తుగా షుగర్ పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. అన్నం తిన్న వెంటనే ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది. పొత్తి కండరాలు దృఢంగా తయారవుతాయి.

వజ్రాసనం వేయడం వల్ల మానసిక సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి మాయం అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మహిళలు వజ్రాసనం వేయడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది. వజ్రాసనం వేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్‌ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం చేయండి. తిన్న తర్వాత వెంటనే ఈ ఆసనం చేయొచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

​మహిళలు వజ్రాసనం వేయడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది. వజ్రాసనం వేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్‌ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం చేయండి. తిన్న తర్వాత వెంటనే ఈ ఆసనం చేయొచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *