Video: టీమిండియా వద్దని ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. వేరే జట్టుతో జత కట్టిన బ్యాడ్ లక్ ప్లేయర్..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Video: టీమిండియా వద్దని ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. వేరే జట్టుతో జత కట్టిన బ్యాడ్ లక్ ప్లేయర్..

Khaleel Ahmed: భారత జట్టులోకి వచ్చి, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కక కొంతకాలంగా దూరంగా ఉన్న ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్, ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్, వన్డే కప్ కోసం ఎసెక్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న ఖలీల్, తన కెరీర్‌కు మరో ఊపిరి పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

భారత జట్టులో ఒకప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లో కీలక బౌలర్‌గా పరిగణించబడిన ఖలీల్ అహ్మద్, తన పేస్, స్వింగ్, వైవిధ్యాలతో ఆకట్టుకున్నాడు. అయితే, గాయాలు, ఆటతీరులో హెచ్చుతగ్గులు అతడిని జట్టుకు దూరం చేశాయి. ఈ మధ్యకాలంలో దేశవాళీ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసినప్పటికీ, జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో, కౌంటీ క్రికెట్ అతడికి ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.

ఎసెక్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ, ఖలీల్ అహ్మద్ తమ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాడని, అతని వైవిధ్యభరితమైన ఎడమచేతి వాటం బౌలింగ్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఖలీల్ సుమారు రెండు నెలల పాటు ఎసెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ కాలంలో 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 8 వన్డేలు ఆడతాడు. ఎసెక్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంటే, మరో రెండు వన్డేలు అదనంగా ఆడే అవకాశం కూడా అతనికి లభిస్తుంది.

ఖలీల్ అహ్మద్ పదకొండు వన్డేలు, పద్దెనిమిది టీ20లు సహా 29 మ్యాచ్‌ల్లో సీనియర్ భారత పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో హాంకాంగ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లలో అరంగేట్రం చేసినప్పటి నుంచి, అహ్మద్ తన 11 వన్డే మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. 31 సగటు, 5.81 ఎకానమీ రేటుతో 3-13 ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

ఇక దేశీయ లిస్ట్ ఏ లో రాజస్థాన్ తరపున ఆడిన అతను 63 మ్యాచ్‌లు ఆడి, 27.92 సగటుతో 92 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 4-35గా నిలిచాయి. అహ్మద్ వైట్-బాల్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 20 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. భారత పరిస్థితులలో 27.67 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఉత్తమ గణాంకాలు 5-37లుగా ఉన్నాయి.

ఖలీల్ అహ్మద్‌తో పాటు, భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (నాటింగ్‌హామ్‌షైర్), తిలక్ వర్మ (హాంప్‌షైర్), రుతురాజ్ గైక్వాడ్ (యార్క్‌షైర్), యుజ్వేంద్ర చాహల్ (నార్తాంప్టన్‌షైర్), షార్దుల్ ఠాకూర్ (ఎసెక్స్) కూడా ఈ సీజన్‌లో వివిధ కౌంటీ జట్ల తరపున ఆడుతున్నారు. ఇది భారత క్రికెటర్లకు అంతర్జాతీయ అనుభవం లేకున్నా, విదేశీ పరిస్థితుల్లో ఆడే అవకాశం లభించడం శుభపరిణామం. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కౌంటీ క్రికెట్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఖలీల్ అహ్మద్‌కి ఈ కౌంటీ స్టంట్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిద్దాం. అతని పేస్, స్వింగ్ కౌంటీ పిచ్‌లపై ఎలా రాణిస్తాయో చూడాలి. ఈ ప్రదర్శనలు అతడిని తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి సహాయపడతాయని ఆశిద్దాం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​County Championship: భారత జట్టులో ఒకప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లో కీలక బౌలర్‌గా పరిగణించబడిన ఖలీల్ అహ్మద్, తన పేస్, స్వింగ్, వైవిధ్యాలతో ఆకట్టుకున్నాడు. అయితే, గాయాలు, ఆటతీరులో హెచ్చుతగ్గులు అతడిని జట్టుకు దూరం చేశాయి. ఈ మధ్యకాలంలో దేశవాళీ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసినప్పటికీ, జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *