Viral: కడుపులో అసౌకర్యంగా ఉందని ఆస్పత్రికి యువకుడు – స్కానింగ్ తీసి రిపోర్ట్ చూడగా స్టన్

Follow

చైనాలోని 29 ఏళ్ల యాన్ అనే యువకుడు ఆరు నెలల పాటు తన శరీరంలో 15 సెం.మీ పొడవైన కాఫీ స్పూన్ ఉన్న విషయాన్ని తెలియకుండానే జీవించాడు. ఈ విచిత్ర సంఘటన అతను థాయ్‌లాండ్‌లో మద్యం మత్తులో ఉంటూ పొరపాటున స్పూన్‌ను మింగడంతో మొదలైంది. జనవరిలో థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన యాన్.. ఎక్కువగా మద్యం తాగిన తర్వాత వాంతి చేయడానికి కాఫీ స్పూన్ ఉపయోగించాడు. అయితే పొరపాటున స్పూన్ అతని గొంతులో జారి పోయింది. ఆ ఘటన తర్వాత అతను సోయి లేకుండా ఉన్నాడు. తర్వాత మేల్కొన్నప్పుడు అదో కల అనుకుని ఆ విషయం పట్టించుకోవడం మానేశాడు. ఆ రోజు అతనికి కడుపు నొప్పి ఉన్నా, అది వాంతుల వల్ల అని భావించాడు.
జూన్‌లో షాంఘైకి తిరిగి వచ్చిన యాన్.. కడుపులో అసౌకర్యంగా అనిపించడంతో.. ఫుడ్ తినేప్పుడు ఏమైనా ప్లాస్టిక్ ముక్కను మింగాడేమోనని అనుమానంతో వైద్యుడిని సంప్రదించాడు. స్కానింగ్ ద్వారా అతని కడపులో సీరామిక్ కాఫీ స్పూన్ అతని చిన్న పేగు మొదటి భాగమైన డుఓడెనమ్(ఇది చిన్నపేగుల మొదటి భాగం)లో ఇరుక్కుని ఉన్నట్లు తెలిసింది.
షాంఘై జోంగ్‌షాన్ హాస్పిటల్ మెడికల్ టీం యాన్‌కు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మొదటి ప్రయత్నంలో ఫోర్సెప్స్ ఉపయోగించి స్పూన్‌ను బయటకు తీయడం కష్టంగా మారింది. ఎందుకంటే అది చాలా మెత్తగా మారిపోయింది. ఆ తర్వాత క్లిష్టమైన పద్ధతితో, రెండు ఫోర్సెప్స్ సహాయంతో స్పూన్‌ను కడుపులోకి తీసుకువచ్చి, అక్కడి నుంచి బయటకు తీశారు. ఈ ఆపరేషన్ సుమారు 90 నిమిషాల పాటు సాగింది. స్పూన్‌ను విజయవంతంగా తొలగించడంతో యాన్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
థాయ్‌లాండ్‌లో మద్యం మత్తులో పొరపాటున కాఫీ స్పూన్ మింగిన 29 ఏళ్ల యువకుడు.. ఆ స్పూన్ తన శరీరంలో ఆరు నెలల పాటు ఉన్న విషయం తెలియకుండానే జీవించాడు. షాంఘైలో వైద్య పరీక్షలో ఈ వింత విషయం వెలుగుచూడడంతో… 90 నిమిషాల సుదీర్ఘ శస్త్రచికిత్స అనంతరం స్పూన్‌ను తొలగించారు.