Viral: జన్మకు ఒక్కసారి అయినా ఇలాంటి లక్ ఉంటుందా – నదిలో వల వేసిన జాలరి – ఏం పడ్డాయో తెల్సా..?

Follow

ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నానీ గోపాల్ అనే మత్స్యకారుడి సుడి తిరిగిపోయింది. ఓ రేంజ్‌లో లక్ కలిసొచ్చింది. దిఘా నదీముఖద్వారంలో అతను విసిరిన వలలో అరుదైన తెలియా భోలా చేపలు చిక్కాయి. అవి కూడా రెండు, మూడు కాదండోయ్.. ఏకంగా 29 చేపలు ఒకేసారి పడ్డాయి. ఒక్కో చోప 20 కిలోలకు పైగా బరువు ఉంది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. నదీముఖద్వారంలోని చేపల వేలం కేంద్రంలో ఈ చేపలు రూ.33 లక్షల ధరకు అమ్ముడయ్యాయి.
తెలియా భోలా చేపలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల తీవ్రమైన వ్యాధులకు మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా సౌందర్య సాధనాల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ సంఘటన ఆ జాలరి జీవితానికి కీలక మలుపు తీసుకొచ్చింది. నానీ గోపాల్ ఇక తన కుటుంబానికి ఎటువంటి ఢోకా లేదని చెబుతున్నాడు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులలో ఆశలు రగిలించింది. ఆ గంగమ్మ ఆశీస్సులు తమకు కూడా దక్కాలని వారు కోరుకుంటున్నారు.
#WATCH | Balasore: Fisherman catches 29 Telia Bhola fish, sells for Rs 33 lakh and becomes a millionaire overnight.#Odisha pic.twitter.com/vr6TQUncrd
— Kalinga TV (@Kalingatv) June 19, 2025
ఆ జాలరి సుడి తిరిపోయింది. ఒక్కరోజులో లక్షలు సంపాదించాడు. జన్మకు ఒక్కసారి అయినా ఇలాంటి లక్ కలిసొస్తో లైఫ్ వేరే లెవల్‌కి వెళ్తుంది. ఒడిశాలో ఓ జాలరిని గంగమ్మ కరుణించింది. అతను వేసిన వలలో అరుదైన చేపలు చిక్కాయి. అవి లక్షలు పలికాయి.