Viswambhara : చిరు సరసన.. స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Mouni Roy Opposite Chiru In A Special Song

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read : Exclusive : డిజాస్టర్ ఎఫెక్ట్.. కొరటాలకు హీరోల కష్టాలు..

టాకీ పార్ట్ ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ఒక సాంగ్ పెండింగ్ ఉంది. అయితే ఈ సాంగ్ కోసం కీరవాణిని కాకుండా భీమ్స్ సిసిరోలియో తో ఓ సాంగ్ చేపించారు. బీమ్స్ మంచి మాస్ బీట్ ను రెడీ చేసాడట. ఇప్పుడు ఆ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. కాగా చిరు సరసన ఎవరు జోడి ఎవరు అనే విషయమై పలువురి భామల పేర్లు వినిపించాయి. కన్నడ భామ నిశ్విక నాయుడు ఫిక్స్ చేసినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆమెను కూడా కాదని మరొక బాలీవుడ్ హాట్ లేడిని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్రలో కీలక రోల్ లో నటించి మెప్పించింది మౌని రాయ్. ఇప్పడు చిరు సినిమాలలో స్పెషల్ సాంగ్ కోసం మౌని రాయ్ ని ఫిక్స్ చేశారు. వాల్తేర్ వీరయ్యలో చిరుతో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల చేసింది. మరి ఇప్పుడు మరొక బాలీవుడ్ బ్యూటీ చిరుతో ఏ రేంజ్ లో డాన్స్ చేస్తుందో చూడాలి.

​మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read : Exclusive : డిజాస్టర్ ఎఫెక్ట్.. కొరటాలకు హీరోల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *