Vodafone Idea: 2G కస్టమర్లకు గుడ్‌న్యూస్: రీఛార్జ్‌లపై కొత్త ఆఫర్..

Follow

వీ గ్యారెంటీ కింద రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ విలువ గల ప్రతి అపరిమిత వాయిస్ రీఛార్జ్ ప్యాక్‌పై 2 రోజుల అదనపు వ్యాలిడిటీ కస్టమర్ ఖాతాకు జమ అవుతుంది. ఈ 24 రోజుల అదనపు వ్యాలిడిటీ 12 నెలల వ్యవధిలో క్రెడిట్ అవుతుంది. వాయిస్-మాత్రమే వినియోగించే లేదా తక్కువ డేటా ఉపయోగించే ప్రీపెయిడ్ కస్టమర్‌లు ఎదుర్కొనే దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడమే వీ గ్యారెంటీ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం.
సాధారణ 28 రోజుల ప్యాక్‌లతో, వినియోగదారులు తరచుగా ఒకే క్యాలెండర్ నెలలో రెండుసార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది లేదా కొన్నిసార్లు సేవలు అంతరాయం అవుతాయి. “వీ గ్యారెంటీ” పరిచయంతో, కస్టమర్‌లు ఇప్పుడు సాధారణ 28 రోజులకు బదులుగా 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ పొందుతారు. ఇది ప్రతి నెలా ఒకే రీఛార్జ్‌తో సరిపెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. 28 రోజుల కన్నా ఎక్కువ వ్యాలిడిటీ గల రీఛార్జ్‌లలో కూడా, అదనపు రెండు రోజులు రీఛార్జ్ సైకిల్‌లోని అంతరాలను తగ్గించి, మరింత సౌలభ్యం, నిరంతర సేవలు అందిస్తాయి.
అర్హులు ఎవరు?
2G హ్యాండ్‌సెట్ ఉపయోగిస్తూ, రూ. 199, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన అపరిమిత వాయిస్ రీఛార్జ్ ప్యాక్‌లు పొందే ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ “వీ గ్యారెంటీ” ప్రయోజనం వర్తిస్తుంది.
ప్యాక్ ప్రయోజనాలు, అదనపు వ్యాలిడిటీ వివరాలు
వీ గ్యారెంటీ పథకం కింద, రూ. 199, రూ. 209 విలువ గల రెండు ప్రముఖ ప్యాక్‌లు అదనపు వ్యాలిడిటీ అందిస్తున్నాయి. రూ. 199 ప్యాక్: ఇందులో అపరిమిత కాల్స్, 2GB డేటా, 300 SMS లభిస్తాయి. అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, రాజస్థాన్ సర్కిళ్లలోని కస్టమర్లకు ఇదే ప్యాక్‌పై 3GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ సాధారణ వ్యాలిడిటీ 28 రోజులు. వీ గ్యారెంటీ కింద అదనంగా 2 రోజులు లభిస్తాయి.
రూ. 209 ప్యాక్: ఇందులో అపరిమిత కాల్స్, 2GB డేటా, 300 SMS, కాలర్ ట్యూన్స్ ప్రయోజనాలు ఉంటాయి. పైన పేర్కొన్న ప్రత్యేక సర్కిళ్లకు చెందిన కస్టమర్లకు ఈ ప్యాక్‌లో కూడా 3GB డేటా, కాలర్ ట్యూన్స్ లభిస్తాయి. ఈ ప్యాక్ కూడా 28 రోజుల సాధారణ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. వీ గ్యారెంటీ ద్వారా అదనంగా 2 రోజులు అందుబాటులో ఉంటాయి. ఈ అదనపు వ్యాలిడిటీ ప్రయోజనం కస్టమర్‌లకు నిరంతర సేవలు అందించడంలో సహాయపడుతుంది.
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (Vi) తమ 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం సరికొత్త “వీ గ్యారెంటీ” ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ వినూత్న పథకం కింద, రూ. 199 ఆపై విలువ కలిగిన అపరిమిత ప్రీపెయిడ్ వాయిస్ ప్యాక్‌లపై వినియోగదారులకు సంవత్సరంలో మొత్తం 24 రోజుల అదనపు వ్యాలిడిటీ ప్రయోజనం లభిస్తుంది. పూర్తి వివరాలివి..