Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Road Caved In, Man Falls In

చండీగఢ్‌: భారీ వర్షం కారణంగా రోడ్డు కుంగింది. బైక్‌పై వెళ్లున్న వ్యక్తి అక్కడ ఏర్పడిన గుంతో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది అతడ్ని కాపాడారు. అలాగే గుంతలో పడిన బైక్‌ను కూడా బయటకు తీశారు. (Road Caved In, Man Falls In With Bike) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల సెక్టార్ 48 ప్రాంతంలోని రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. అప్పుడే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దానితో సహా ఆ గుంతలో పడిపోయాడు.

కాగా, గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గుంతలో పడిన వ్యక్తిని కాపాడి బయటకు తీశారు. ఆ గుంతో ఇరుక్కున్న బైక్‌ను కూడా కొంత శ్రమించి బయటకు లాగారు.

మరోవైపు అక్కడున్న కొందరు వ్యక్తులు దీనిని రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. చండీగఢ్‌ పరిపాలన యంత్రాంగంపై మండిపడ్డాడు. అన్ని విభాగాలలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. విజిలెన్స్, అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించాడు. కాగా, రోడ్డుపై ఏర్పడిన గుంతలో పడిన వ్యక్తిని రక్షించి, అతడి బైక్‌ను బయటకు తీసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Also Read:

Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?

Road Built With Trees Middle | బయటపడిన అధికారుల నిర్లక్ష్యం.. చెట్ల మధ్యలో వంద కోట్లతో రోడ్డు నిర్మాణం

Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి

 

​Road Caved In, Man Falls In With Bike | భారీ వర్షం కారణంగా రోడ్డు కుంగింది. బైక్‌పై వెళ్లున్న వ్యక్తి అక్కడ ఏర్పడిన గుంతో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది అతడ్ని కాపాడారు. అలాగే గుంతలో పడిన బైక్‌ను కూడా బయటకు తీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *