WSKL | దుబాయ్ వేదికగా ‘వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్‌’.. ఫిబ్రవరిలో తొలి సీజన్..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kabaddi

WSKL : ఐపీఎల్ రాకతో పొట్టి క్రికెట్‌ దశ మారినట్టే అన్ని ఆటల రూపరేఖలు కూడా మరిపోతున్నాయి. ఇంతకుముందు మట్టికోర్టు ఆటగా పేరొందిన కబడ్డీకి ప్రో -కబడ్డీ లీగ్‌(PKL)తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సాధ్యమైంది. పీకేఎల్‌ తరహాలోనే మరో లీగ్‌ ఫ్యాన్స్‌ను అలరించనుంది. అయితే.. భారత గడ్డపై కాకుండా విదేశీ నేలపై ఈ లీగ్ జరుగనుంది. వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్‌(World Super Kabaddi League) తొలి సీజన్‌ దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొత్తం 30 జట్లు పాల్గొనే ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి మధ్యలో జరుగనుందని సమాచారం.

పీకేఎల్ విజయవంతం కావడంతో వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్‌ కూడా హిట్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య(IKF) కూడా పచ్చజెండా ఊపింది. దాంతో, ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో ఈ లీగ్‌ను జరపాలనే ఆలోచనతో ఉన్నారు ఆర్గనైజర్స్. ‘కబడ్డీకి ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. అందుకే ఈ ఆటను భారత్‌లోనే కాకుండా విశ్వమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. అందుకే.. వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్‌ను నిర్వహించాలనుకుంటున్నాం.

Wskl

ఈ లీగ్‌లో వరల్డ్ స్టేజిపై కబడ్డీ అనే మా లక్ష్యం నెరవేరుతుంది. ఈ టోర్నీతో ప్రతిభావంతులను వెలుగులోకి తేవడంతో పాటు ఈ ఆటకు ఒలింపిక్ గుర్తింపు కూడా తీసుకురావాలని భావిస్తున్నాం. ఎనిమిది జట్లతో జరుగబోయే తొలి ఎడిషన్ వేలంలో ఆటగాళ్లను కొనేందుకు రూ.48 కోట్ల పరిమితి విధించాలని అనుకుంటున్నాం’ అని ఎస్‌జే అప్‌లిఫ్ట్ కబడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సంభవ్ జైన్ (Sambhav Jain) వెల్లడించాడు.

డబ్ల్యూఎస్కేఎల్‌ ప్రతిపాదనకు పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. కబడ్డీని ఎంతో ఇష్టపడే దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్‌లాండ్, పాకిస్థాన్, మలేషియా, జపాన్, కెనడాలతో పాటు ఆమెరికా సైతం కొత్త లీగ్ తొలి సీజన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

​WSKL : ఐపీఎల్ రాకతో పొట్టి క్రికెట్‌ దశ మారినట్టే అన్ని ఆటల రూపరేఖలు కూడా మరిపోతున్నాయి. ఇంతకుముందు మట్టికోర్టు ఆటగా పేరొందిన కబడ్డీకి ప్రో -కబడ్డీ లీగ్‌(PKL)తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సాధ్యమైంది. పీకేఎల్‌ తరహాలోనే మరో లీగ్‌ ఫ్యాన్స్‌ను అలరించనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *