Yellandu : కాంగ్రెస్ పాలనలో పడకేసిన పారిశుధ్యం : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

Follow

ఇల్లెందు జూన్ 23 : కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపుమేరకు ఇల్లెందు నియోజక వర్గం పరిధిలో అన్ని పంచాయతీ కార్యాలయాల ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా జగదాంబ సెంటర్ దిండిగాల కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, గోవిందు సెంటర్ మీదుగా పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో హరిప్రియ నాయక్, దిండిగల రాజేందర్ పాల్గొని మాట్లాడారు.
గత 18 నెలలుగా కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి పనులను మళ్లీ ప్రారంభిస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఒక్క పని కూడా ప్రారంభించలేదన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శ్రద్ధతో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా శానిటేషన్ కార్యక్రమాలతో, సైడ్ డ్రైనేజీల్లో నీరు నిల్వకుండా చెత్తాచెదారం తొలగించే కార్యక్రమం నిర్వహించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందస్తు కార్యక్రమాలు ఏమి జరపకుండానే గతంలో నిర్వహించిన పనులు అన్నిటిని బంద్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు.
అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ అంకుశావల్లికి మున్సిపాలిటీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, సుదర్శన్ రంగనాథ్, లాల్ సింగ్, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, వార్డు కౌన్సిలర్, 2వ వార్డు కటకం పద్మావతి, శ్యామల మాధవి 5 వార్డు, తోట లలిత శారద ఆరో వార్డు, జెకె శ్రీను 11వ వార్డు, సంద బిందు 14వ వార్డు, చీమల సుజాత 17వ వార్డు, యలమందల వీణ వాసు ఐదో వార్డు, వాంకుడు తార 24 వ వార్డు, కడగంచి పద్మ 13వ వార్డు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపుమేరకు ఇల్లెందు నియోజక వర్గం పరిధిలో అన్ని పంచాయతీ కార్యాలయాల ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు.